ఓ కంట కన్నీరు... ఓ కంట పన్నీరు..!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రస్తుతం వెలువడుతున్న ఎన్నికల ఫలితాలతో అంత ఆనందంగా లేరనే చెప్పాలి. తెలంగాణ ఎన్నికల్లో లోపాయికారీగా కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన తెలుగుదేశం... కాంగ్రెస్ గెలుపుపై చాలా హ్యాపీగా ఉంది. తామే గెలిచినంతగా ఆ పార్టీ కార్యకర్తలు ఆనందపడుతున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించడంపై తెలుగు తమ్ముళ్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చంద్రబాబు పరిస్థితి

చంద్రబాబుకు మరోవైపు గుబులు కూడా మొదలైంది. నాలుగు కీలక రాష్ట్రాల్లో మూడిరటిలో భాజపా అధికారంలోకి వస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లాంటి హిందీ హార్ట్‌ల్యాండ్‌లో కమలం పార్టీ విజయం దిశగా అడుగులు వేస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లు రెండూ పెద్ద రాష్ట్రాలు. అక్కడ భారీ విజయాలు నమోదు చేస్తోంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలిచి ఉంటే చంద్రబాబు జాతీయ స్థాయిలో చక్రం తిప్పేవారు. భాజపాతో పొత్తు గురించి కూడా ఆలోచించేవారే కాదు.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు తిరుగుండదు. చంద్రబాబు ప్రభావం కేవలం తెలంగాణ వరకే ఉంటుంది. కొంతవరకూ ఆంధ్రలో వైకాపాను ఆయన ఇబ్బంది పెట్టగలరు. కానీ కేంద్రంలో ఆయన పాత్ర ఏమీ ఉండదు. భాజపా ప్రాపకం కోసం ఆయన ప్రయత్నించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ విషయం సైకిల్ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు.