వచ్చేది టీడీపీ ప్రభుత్వమే..రెండేళ్లు ఆగండి
సర్పంచ్ లు ఐదేళ్లు ఉంటారని, వైసీపీ ప్రభుత్వం ఇక అధికారంలో ఉండేది రెండేళ్లు మాత్రమేనని గుర్తుంచుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన రెండో విడత నామినేషన్లు [more]
సర్పంచ్ లు ఐదేళ్లు ఉంటారని, వైసీపీ ప్రభుత్వం ఇక అధికారంలో ఉండేది రెండేళ్లు మాత్రమేనని గుర్తుంచుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన రెండో విడత నామినేషన్లు [more]
సర్పంచ్ లు ఐదేళ్లు ఉంటారని, వైసీపీ ప్రభుత్వం ఇక అధికారంలో ఉండేది రెండేళ్లు మాత్రమేనని గుర్తుంచుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన రెండో విడత నామినేషన్లు ప్రారంభమయ్యే ప్రాంతాల నేతలతో మాట్లాడారు. రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని, పాత బిల్లుల బకాయీలను వడ్డీతో సహా చెల్లిస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రతి పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ద్వారా ఐదేళ్లలో ఐదుకోట్ల రూపాయల పనులు జరుగుతాయని చెప్పారు. ఒక్క ఉపాధి హామీ పథకం కింద వచ్చే ఐదేళ్లలో పదమూడువేల పంచాయతీల్లో 70 వేల కోట్ల పనులు జరుగుతాయని, అందుకే అందరూ నామినేషన్లు వేసి సర్పంచ్ గా గెలిచేందుకు కృషి చేయాలని చంద్రబాబు టీడీపీ నేతలకు పిలుపు నిచ్చారు.