పొరపాటు చేశాను.. నిజమే.. మరోసారి జరగదు
కుప్పం నియోజకవర్గాన్ని తాను నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాభివృద్ధిపైనే ఎక్కువ దృష్టిపెట్టానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నిధుల్లో 85 [more]

కుప్పం నియోజకవర్గాన్ని తాను నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాభివృద్ధిపైనే ఎక్కువ దృష్టిపెట్టానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నిధుల్లో 85 శాతం కుప్పం నియోజకవర్గానికి కేటాయించి ఉంటే ఇప్పుడు ఈ సమస్య ఉండేది కాదని అన్నారు. భవిష్యత్ లో ఇలాంటి పొరపాట్లు జరగవని చంద్రబాబు కార్యకర్తల సమావేశంలో తెలిపారు. కుప్పం నియోజకవర్గాన్ని వదలిపెట్టి తాను పులివెందులకే నీళ్లు ఇచ్చానని, అదే తాను చేసిన పొరపాటని చంద్రబాబు కార్యకర్తల ముందు అంగీకరించారు. పంచాయతీ ఎన్నికలు తనకు ఒక గుణపాఠమని చంద్రబాబు అన్నారు.