కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారు
మిల్లర్లు, వైసీపీ నేతలు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు కూడా [more]
మిల్లర్లు, వైసీపీ నేతలు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు కూడా [more]
మిల్లర్లు, వైసీపీ నేతలు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు కూడా సక్రమంగా జరగడం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. మద్దతు ధర కు కొనుగోలు చేయడంలోనూ ప్రభుత్వ విఫలమయిందన్నారు. ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు దాటినా రైతులకు డబ్బులు చెల్లించలేదన్నారు. రాయలసీమలోవేరుశెనగ పంట నష్టపోయినా ఇన్ పుట్ సబ్సిడీ అందలేదన్నారు. ఇలాగయితే ఖరీఫ్ లో రైతులకు పెట్టుబడులు ఎవరిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేసి తక్షణమే చెల్లింపులు జరపాలని చంద్రబాబు కోరారు.