జగన్ కు మామ చనిపోయినా బాధ లేదు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. సాధన దీక్ష ముగింపు సభలో ఆయన మాట్లాడారు. జగన్ కు తన మామ [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. సాధన దీక్ష ముగింపు సభలో ఆయన మాట్లాడారు. జగన్ కు తన మామ [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. సాధన దీక్ష ముగింపు సభలో ఆయన మాట్లాడారు. జగన్ కు తన మామ కోవిడ్ తో చనిపోయినా బాధ లేదన్నారు. కోవిడ్ ను చాలా లైట్ గా తీసుకున్నందునే కేసుల సంఖ్య పెరిగిందని చంద్రబాబు అన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రజలను కాపాడే ఆలోచన ఈ ముఖ్యమంత్రికి లేదన్నారు. కరోనా మరణాలపై అన్నీ తప్పుడు లెక్కలు చెబుతున్నారని, ఈయన ఒక ఫేక్ ముఖ్యమంత్రి అని చంద్రబాబు అన్నారు.
నా పాలన చూసి నేర్చుకో…..
తాను కరోనా పై ఎన్ని సూచనలు చేసినా పట్టించుకోలేదన్నారు. బాధ్యతగల ముఖ్యమంత్రిగా ప్రతిపక్షం చేసిన సూచనలను పక్కన పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. కోవిడ్ నిబంధనలను అమలు చేయడంలో విఫలమయ్యారని చెప్పారు. చివరకు వ్యాక్సినేషన్ ఇవ్వడంలోనూ ఫెయిలయ్యారని చంద్రబాబు తెలిపారు. ఒకసారి తన పాలన చూస్తే ఎలా చేయాలో తెలుస్తుంది అని చంద్రబాబు అన్నారు. తాను సంక్షోభ సమయాన్ని సవాల్ గా తీసుకుంటున్నానన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా తాను ఎన్నో విపత్తులను ఎదుర్కొన్నానని చంద్రబాబు చెప్పారు. తాను ముందుచూపుతోనే ఫార్మా కంపెనీలు, ఐటీ కంపెనీలు తన హయాంలోనే వచ్చాయని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికైనా కరోనా బాధితులను ఆదుకుని వారికి పరిహారం చెల్లించాలని చంద్రబాబు కోరారు.