తమాషాలు చేయొద్దండి
తన రాజకీయ జీవితంలో ఎంతోమంది ముఖ్యమంత్రులన చూశానని, ఇంతటి అసమర్థ, అవినీతి ముఖ్యమంత్రిని తాను చూడలేదని చంద్రబాబు అన్నారు. దేవినేని ఉమ కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు తర్వాత [more]
తన రాజకీయ జీవితంలో ఎంతోమంది ముఖ్యమంత్రులన చూశానని, ఇంతటి అసమర్థ, అవినీతి ముఖ్యమంత్రిని తాను చూడలేదని చంద్రబాబు అన్నారు. దేవినేని ఉమ కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు తర్వాత [more]
తన రాజకీయ జీవితంలో ఎంతోమంది ముఖ్యమంత్రులన చూశానని, ఇంతటి అసమర్థ, అవినీతి ముఖ్యమంత్రిని తాను చూడలేదని చంద్రబాబు అన్నారు. దేవినేని ఉమ కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈముఖ్యమంత్రి, ప్రభుత్వానికి సిగ్గుందా? అని ప్రశ్నించారు. కొండపల్లి బొమ్మలను తయారు చేసే చెట్లను కూడా కొట్టేస్తున్నారని చంద్రబాబు ఆవేదన చెందారు. తన హయాంలో ఎంతోమంది డీజీపీలు పనిచేశారని, ఇలాంటి అరాచకాలు ఎప్పుడూ జరగలేదన్నారు. పులివెందుల పంచాయతీలను అడ్డుకోవాలన్నారు. సంక్షేమం, అభివృద్ధి జగన్ వల్ల కాదన్నారు. ఇలాంటి వారిని తెలుగుదేశం పార్టీ ఎంతో మందిని చూసిందని, భయపడే ప్రసక్తి లేదని చంద్రబాబు అన్నారు. కొండపల్లి పరిశీలనకు తమ పార్టీనేతలు వెళుతుంటే వారిని అక్రమంగా అడ్డుకుంటున్నారన్నారు. 9 గంటల పాటు దేవినేని ఉమ కారులోనే ఉన్నారని, హత్యాయత్నం ఎలా చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రశ్నిస్తే కేసులు పెడితే ఫలితం అనుభవిస్తారని చంద్రబాబు అన్నారు. సరిగా పాలన చేస్తే చేయండి..లేకపోతే దిగిపోండి అని చంద్రబాబు అన్నారు. రేపు ఎక్కడికి వెళతారు? రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామని, డిక్టేటర్లు కాదని, తమాషాలు చేయొద్దండి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.