ఉమ కాన్వాయ్ ను అడ్డుకోవడమేంటి?
మాజీ మంత్రి దేవినేని ఉమ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకోవడమేంటని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో పౌరులకు తిరిగే స్వేచ్ఛ లేదా? అని ఆయన ప్రశ్నించారు. [more]
మాజీ మంత్రి దేవినేని ఉమ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకోవడమేంటని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో పౌరులకు తిరిగే స్వేచ్ఛ లేదా? అని ఆయన ప్రశ్నించారు. [more]
మాజీ మంత్రి దేవినేని ఉమ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకోవడమేంటని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో పౌరులకు తిరిగే స్వేచ్ఛ లేదా? అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలను చూస్తేనే జగన్ భయపడుతున్నారని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. దేవినేని ఉమ కాన్వాయ్ ను అడ్డుకోవడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయి దేవినేని ఉమ కాన్వాయ్ తో వస్తుండగా పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు నిలిపివేశారు. ఆయన ఒక్క వాహానాన్ని మాత్రమే వెళ్లేందుకు అనుమతించారు. దీంతో దేవినేని ఉమ అక్కడే నిరసనకు దిగారు.