Thu Dec 26 2024 16:53:19 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ… పోలీసులపై ఫైర్
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కొందరు పోలీసులు వైసీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని తెలిపారు. రెండేళ్ల [more]
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కొందరు పోలీసులు వైసీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని తెలిపారు. రెండేళ్ల [more]
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కొందరు పోలీసులు వైసీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని తెలిపారు. రెండేళ్ల నుంచి టీడీపీ కార్యకర్తలపై పోలీసు వేధింపులు కొనసాగుతున్నాయని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాల్సి ఉండగా, ఏకపక్షంగా పనిచేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. చట్టానికి లోబడి పోలీసులు పనిచేయాలని కోరారు. ప్రకాశం జిల్లా లింగసముద్రం పోలీసులు టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని చంద్రబాబు డీజీపీకి రాసిన లేఖలో కోరారు.
Next Story