Chandrbabu : డీజీపీకి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా చంద్రబాబు అభివర్ణించారు. తాను డీజీపీకి ఫోన్ చేసినా స్పందించలేదన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలాంటి [more]
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా చంద్రబాబు అభివర్ణించారు. తాను డీజీపీకి ఫోన్ చేసినా స్పందించలేదన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలాంటి [more]
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా చంద్రబాబు అభివర్ణించారు. తాను డీజీపీకి ఫోన్ చేసినా స్పందించలేదన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు చూడలేదని చంద్రబాబు తెలిపారు. ఇలాంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమయిందని చంద్రబాబు తెలిపారు. డ్రగ్ మాఫియాను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ దాడుల్లో ముగ్గురు ఐసీయూల్లో చికిత్స పొందుతున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇలంటి దాడులకు భయపడేది లేదన్నారు. ప్రజలు కూడా వీటిని అర్థం చేసుకోవాలని చంద్రబాబు కోరారు ఇది తన పోరాటం కాదని, ప్రజాస్వామ్యం కోసం పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అందరం కాపాడుకుందామని చంద్రబాబు కోరారు.