Chandrababu : వచ్చేది టీడీపీ ప్రభుత్వమే.. అప్పుడు చూపిస్తాం
ఆంధ్రప్రదేశ్ లో తిరిగి రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. బెదిరింపులకు పాల్పడి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారన్నారు. వైసీపీ వాళ్ల అరాచకాలకు అంతే లేకుండా [more]
ఆంధ్రప్రదేశ్ లో తిరిగి రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. బెదిరింపులకు పాల్పడి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారన్నారు. వైసీపీ వాళ్ల అరాచకాలకు అంతే లేకుండా [more]
ఆంధ్రప్రదేశ్ లో తిరిగి రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. బెదిరింపులకు పాల్పడి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారన్నారు. వైసీపీ వాళ్ల అరాచకాలకు అంతే లేకుండా పోయిందన్నారు. తాము న్యాయస్థానాల్లో వైసీపీని దోషుగా నిలబెడతామని చంద్రబాబు చెప్పారు. ప్రశాంతంగా ఉన్న కుప్పంలో టీడీపీ నేతలపై దాడులకు తెగబడ్డారన్నారు. మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డిని ఈడ్చుకెళ్లడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు.
అన్ని రకాలుగా నాశనమే….
ఆంధ్రప్రదేశ్ ను ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాలుగా నాశనం చేశారన్నారు. అప్పులు చేసి సర్వనాశనం చేశారన్నారు. ఈ రాష్ట్రం మీ నాన్న సొత్తా అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడానికి సిగ్గనిపించలేదా? అని చంద్రబాబు నిలదీశారు. పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గించేంతవరకూ పోరాడతామని చంద్రబాబు చెప్పారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని గెలవాలని మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు అన్నారు టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇప్పుడు అరాచకాలకు పాల్పడుతున్న వారిని వదిలిపెట్టబోమని చంద్రబాబు హెచ్చరించారు.