Mon Nov 25 2024 09:25:47 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీలో ప్రకంపనలు.. అందుకే వాళ్లను ఆ బాధ్యతల నుండి తప్పించారు : చంద్రబాబు
దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో
రాష్ట్రంలో పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను మార్చుతూ సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. రెండు మూడు జిల్లాలకు కలిపి ఒకరికి అధ్యక్ష బాధ్యతలను అప్పజెప్పారు. పైగా కొత్తగా నియమితులైనవారంతా దాదాపు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. సుచరిత, ముత్తంశెట్టి శ్రీనివాస్, పుష్ప శ్రీవాణి, బుర్రా మధుసూదన్ యాదవ్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాల నాగిరెడ్డి తదితరులను జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలను తప్పించి.. వారి స్థానాల్లో కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆక్వా రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కర్నూలులో తాను నిర్వహించిన పర్యటనకు యువత, ప్రజల నుంచి విశేషరీతిలో స్పందన వచ్చిందని, 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత భారీ స్పందన ఎన్నడూ చూడలేదన్నారు. టీడీపీకి వస్తున్న స్పందనతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయని, అందుకే 8 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను మార్చేశారని ఎద్దేవా చేశారు.
రానున్న ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో వైసీపీ ఓటమి తధ్యమన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆక్వారంగానికి పునర్వైభవాన్ని తీసుకొచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. అలాగే ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. జోన్, నాన్ జోన్ విధానాలను ఎత్తివేసి ఆక్వా రంగాన్ని ఆదుకుంటామన్నారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో ఆక్వారంగానికి సంబంధించిన అంశాలకు కూడా చోటిస్తామన్నారు.
Next Story