సీనియర్ నేతలతో బాబు భేటీ.. మున్సిపల్ ఎన్నికలపై…?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు టీడీపీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికలపై చంద్రబాబు సమీక్షించారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పంచాయతీ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు టీడీపీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికలపై చంద్రబాబు సమీక్షించారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పంచాయతీ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు టీడీపీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికలపై చంద్రబాబు సమీక్షించారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పంచాయతీ ఓటర్లకు, పట్టణ ఓటర్లకు మనస్తత్వంలో తేడా ఉంటుందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు. బలవంతపు ఏకగ్రీవాలు కాకుండా అడ్డుకోవాలని చెప్పారు. ప్రధానంగా విశాఖలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అరాచకాలను ప్రజల ముందుంచాలన్నారు. పంచాయతీ ఎన్నికలలో చూపించిన తెగువను మున్సిపల్ ఎన్నికల్లోనూ చూపాలని చంద్రబాబు ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు.