రౌడీలకు రౌడీని నేను.. వైసీపీకి బాబు వార్నింగ్
వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రోడ్ షో లో చంద్రబాబు పొల్గొన్నారు. కృష్ణా జిల్లా ఇన్ ఛార్జి [more]
వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రోడ్ షో లో చంద్రబాబు పొల్గొన్నారు. కృష్ణా జిల్లా ఇన్ ఛార్జి [more]
వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రోడ్ షో లో చంద్రబాబు పొల్గొన్నారు. కృష్ణా జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద రౌడీ అనుకుంటున్నారని, రౌడీలకు రౌడీని నేనని చంద్రబాబు అన్నారు. ఇన్ని అరాచకాలు జరుగుతున్నా మీకు రోషం లేదా? పౌరుషం లేదా? ఇంటికి ఒకరు చొప్పున వీధుల్లోకి రాలేరా? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ వెనక రౌడీలుంటే తన వెనక ప్రజలు ఉన్నారని చంద్రబాబు చెప్పారు. జగన్ రెడ్డి పాలనలో ఒక అభివృద్ధి పనైనా జరిగిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. విజయవాడలో టీడీపీ అభ్యర్థులను గెలిపించి వైసీపీ అరాచకపాలనకు చరమగీతం పాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.