ఇక అవి చెల్లవ్… నేతలకు బాబు వార్నింగ్
పార్టీ కోసం పనిచేసి పోరాడే వాళ్లకే భవిష్యత్ లో గుర్తింపు ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతి ఉప ఎన్నికపై చంద్రబాబు నేతలతో సమీక్షించారు. ఇది [more]
పార్టీ కోసం పనిచేసి పోరాడే వాళ్లకే భవిష్యత్ లో గుర్తింపు ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతి ఉప ఎన్నికపై చంద్రబాబు నేతలతో సమీక్షించారు. ఇది [more]
పార్టీ కోసం పనిచేసి పోరాడే వాళ్లకే భవిష్యత్ లో గుర్తింపు ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతి ఉప ఎన్నికపై చంద్రబాబు నేతలతో సమీక్షించారు. ఇది అది పెద్ద ఉప ఎన్నికగా చంద్రబాబు నేతలకు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చెప్పేందుకు మంచి అవకాశమని పేర్కొన్నారు. పనిచేయకుండా నేతలు కబుర్లు చెబితే కుదరదని చంద్రబాబు నేతలను హెచ్చరించారు. రిజర్వేషన్లు, విధేయతలు, మొహమాటాలు ఇకపై చెల్లవని చంద్రబాబు స్పష్టం చేశారు. నాయకుల పనితీరును బట్టే ఫలితాలు ఉంటాయని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నిక కోసం పర్యవేక్షక కమిటీని నియమించారు. ఇందులో నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పనబాక కృష్ణయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్ లను చంద్రబాబు నియమించారు.