రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలు… చంద్రబాబు పిలుపు
వైసీపీ ప్రభుత్వానికి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలను చేపడతామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా తాము [more]

వైసీపీ ప్రభుత్వానికి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలను చేపడతామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా తాము సూచనలు చేస్తుంటే తమపైనే వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారని చంద్రబాబు అన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ ముఖ్యమంత్రులు లాగా సీఎం జగన్ వ్యాక్సిన్లకు ఆర్డర్ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దేశంలో 33 జిల్లాల్లో కరోనా తీవ్రత ఉంటే అందులో ఏడు జిల్లాలు ఏపీలోనే ఉన్నాయని చంద్రబాబు అన్నారు. తమపై ఎదురుదాడి మాని కరోనా నియంత్రణపై దృష్టి పెట్టాలని చంద్రబాబు కోరారు. వ్యాక్సినేషన్ సరఫరా చేయాలంటూ ఈ నెల 8వ తేదీన తమ పార్టీ నిరసనలు చేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.