బాబు అత్యవసర సమావేశం… భేటీలో?
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. నదీ జలాల విషయంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పపట్టారు. [more]
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. నదీ జలాల విషయంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పపట్టారు. [more]
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. నదీ జలాల విషయంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పపట్టారు. గెజిట్ విడుదలతో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు భవిష్యత్ లో నష్టపోతాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. సాగునీరు భవిష్యత్ లో ఈ ప్రాంత రైతులకు అందదని అభిప్రాయపడ్డారు. జగన్ తనపై ఉన్న కేసులకు భయపడి నదీజలాలపై రాష్ట్రాలకు ఉన్న హక్కులను ధారాదత్తం చేశారని చంద్రబాబు ఆరోపించారు. అలాగే జాబ్ క్యాలండర్ పై తమ పోరాటం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ధాన్యం బకాయీలను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రహదారులకు యుద్దప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని చంద్రబాబు కోరారు.