Thu Jan 16 2025 02:50:17 GMT+0000 (Coordinated Universal Time)
ఆయనను చూస్తే చిన్నపిల్లలు జడుసుకుంటారు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ఆశావర్కర్ల సమావేశంలో పుట్టిన ప్రతీ బిడ్డకు తన గురించి చెప్పాలని, పెద్దయ్యాక వారు తనకు ఓటేస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. పుట్టిన పిల్లలకు చంద్రబాబు పేరు పెట్టమని జీఓ జారీ చేయనందుకు ఆంధ్ర ప్రజలంతా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు టీవీల్లో కనపడితేనే పిల్లలు చూడవద్దని తల్లిదండ్రులు ఛానల్ మారుస్తారని పేర్కొన్నారు. ఆశా వర్కర్ల సమావేశంలో వారి డిమాండ్లపై మాట్లాడకుండా తన గురించి చెప్పమంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబును చూస్తేనే పిల్లలు జడుసుకుంటారని ఎద్దేవా చేశారు.
Next Story