జాతకాలున్నాయ్...జాగ్రత్త... లేకుంటే....?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొందరు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు తీవ్రస్థాయిలో హెచ్చరికలు కూడా జారీ చేశారు. అందరి జాతకాలు తన దగ్గర ఉన్నాయని తీవ్ర స్వరంతో ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. రేపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ఈరోజు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ప్రజలకు సేవ చేసే గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. పనితీరు మెరుగుపర్చుకోవాలని తాను ఎప్పటి నుంచో చెబుతున్నా కొందరు పట్టించుకోవడం లేదన్నారు. ఈరోజు ప్రగతి నివేదకలిస్తానని, తర్వాత అందరితో వ్యక్తిగతంగా మాట్లాడతానని చంద్రబాబు చెప్పారు. పార్టీ ఉంటేనే మనం ఉంటామని గుర్తుంచుకోవాలన్నారు. అహాన్ని వీడితేనే అందరూ ఆదరిస్తారని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యలతో సిట్టింగ్ ఎమ్మెల్యల్లో టెన్షన్ మొదలయింది.
- Tags
- andhra pradesh
- ap politics
- janasena party
- nara chandrababu naidu
- pawan kalyan
- serious
- tdp meet
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆగ్రహం
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- టీడీపీ సమావేశం
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ