ఈనెల 23న చంద్రుడిపై అడుగుపెట్టనున్న చంద్రయాన్- 3, చంద్రుడిపై పేలిన రష్యా శాటిలైట్
ఇస్త్రో శాస్త్రవేత్తలు మరో విజయం సాధించారు. చంద్రయాన్ -3 లో ఫైనల్ డీ బూస్టింగ్ ఆపరేషన్ చేపట్టి విజయవంతంగా ల్యాండర్ ను దిగువ కక్ష్యకు చేర్చారు
ఇస్త్రో శాస్త్రవేత్తలు మరో విజయం సాధించారు. చంద్రయాన్ -3 లో ఫైనల్ డీ బూస్టింగ్ ఆపరేషన్ చేపట్టి విజయవంతంగా ల్యాండర్ ను దిగువ కక్ష్యకు చేర్చారు. దీంతో ఈ నెల 23న సాయంత్రం 5.45 గంటలకు చంద్రుడు పై అడుగు పెట్టే ప్రక్రియపై ఆసక్తి పెరుగుతోంది. చంద్రుడి అతి దగ్గర కక్ష్యలోకి విక్రమ్ మాడ్యూల్ చేసింది. చంద్రుడి నుంచి విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం అత్యల్పంగా 25 కిలో మీటర్లు, అత్యధికంగా 134 కిలో మీరట్ల దూరంలో ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ కీలక ఘట్టం పూర్తి కావటంతో ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై దిగటమే మిగిలి ఉంది. దీంతో, ఇస్రో శాస్త్రవేత్తలు కీలక, చివరి దశ అయిన విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ పైనే ఫోకస్ చేసారు. ఇస్రో ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఘనంగా కాలు మోపనుంది. రెండో చివరి డీ బూస్టింగ్ ఆపరేషన తో ల్యాండర్ మాడ్యూల్ 25 కిలో మీటర్లు..134 కిలో మీటర్ల కక్ష్యలోకి చేరందని తాజాగా ఇస్రో ట్వీట్ లో పేర్కొంది. మాడ్యూల్ ను అంతర్గతంగా తనిఖీ చేయాల్సి ఉందని వెల్లడించింది.
రష్యా చంద్రుడిపై ప్రయోగించిన లూన -25 ప్రోబ్ చంద్రుడిపై పేలిపోయిందని రాస్ కాస్మోస్ తాజాగా ప్రకటించింది.