30 ఏళ్లుగా ఓటేయని దళితులు..!
చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ కు ఆదేశించిన ఐదు పోలింగ్ బూత్ లలో 30 ఏళ్లుగా దళితులను ఓటు వేయనివ్వలేదని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. [more]
చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ కు ఆదేశించిన ఐదు పోలింగ్ బూత్ లలో 30 ఏళ్లుగా దళితులను ఓటు వేయనివ్వలేదని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. [more]
చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ కు ఆదేశించిన ఐదు పోలింగ్ బూత్ లలో 30 ఏళ్లుగా దళితులను ఓటు వేయనివ్వలేదని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. రీపోలింగ్ ను స్వాగతించిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ… దళితుల ఓట్లను ఇన్నేళ్లుగా బూత్ క్యాప్చర్ చేసి టీడీపీ వారే వేస్తున్నారని ఆరోపించారు. దళితులకు ఓటు వేసే అవకాశం కల్పించాలని, భద్రత నడుమ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల రోజు తాను కలెక్టర్ ను కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు. తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలని దళితులు ఏడాది నుంచే ఎన్నికల సంఘానికి అనేక లేఖలు రాసినా చివరకు వారికి ఓటు వేసే అవకాశం దక్కలేదన్నారు. అందుకే రీపోలింగ్ జరపాలని అన్ని ఎన్నికలు జరిగిన వెంటనే ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు. రీపోలింగ్ ను టీడీపీ వ్యతిరేకించడం సరికాదన్నారు. అబద్ధాలు చెప్పడంతో టీడీపీ నేతలు చంద్రబాబును మించిపోయారని అరోపించారు. తాను ఏడు పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ జరపాలని ఈసీని కోరితే ఐదింటిలోనే రీపోలింగ్ జరిపేందుకు ఈసీ నిర్ణయించిందని, మిగతా రెండు బూత్ లలోనూ రీపోలింగ్ కోసం సుప్రీం కోర్టుకు వెళతామన్నారు.