Sun Dec 22 2024 15:31:00 GMT+0000 (Coordinated Universal Time)
Chhattisgarh : పుష్ప సినిమా చూసి స్ఫూర్తి పొందారేమో.. అంబులెన్స్‌లో స్మగ్లింగ్..
ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్ లో కొందరు పుష్ప స్టైల్ లోనే స్మగ్లింగ్ చేస్తూ పోలిసులకు పట్టుబడ్డారు. ఇంతకీ అసలు ఏమైంది..?
ఈ మధ్య సినిమాలు చూసి జనాలు బాగా స్ఫూర్తి పొందుతున్నారట. సినిమాల్లో తెలివిగా చేసే క్రైమ్ లని అలానే బయట చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలోనే గతంలో పుష్ప సినిమా చూసి ఎర్రచందనం స్మగ్లింగ్ ని పాల్పడిన సంఘటనలు విన్న సంగతి తెలిసిందే. తాజాగా ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్ లో కొందరు పుష్ప సినిమా స్టైల్ లోనే స్మగ్లింగ్ చేస్తూ పోలిసులకు పట్టుబడ్డారు. ఇంతకీ అసలు ఏమైంది..?
బుధవారం అర్ధరాత్రి రాయ్‌పూర్ పోలీసులు అనుమానాస్పద స్థితిలో పయనిస్తున్న ఓ అంబులెన్స్ ని అడ్డుకొని తనిఖీ చేసినట్లు ఆజాద్‌చౌక్ సిటీ ఎస్పీ మయాంక్ గుర్జార్ మీడియాకి తెలియజేశారు. ఆ అంబులెన్స్‌లో 364 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో రాయ్‌పూర్ పోలీసులు ఓ యువకుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు కోసం అతడి విచారిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
పుష్ప సినిమాలో కూడా ఎర్రచందనం చెక్కల్ని అంబులెన్స్ పెట్టి తరలించిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు.. పుష్ప సినిమా చూసి స్ఫూర్తి పొందారేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా పుష్ప సినిమా నార్త్ లో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే.
Next Story