Mon Dec 23 2024 16:44:45 GMT+0000 (Coordinated Universal Time)
సంక్రాంతి తర్వాత జగన్ కు ఝలక్...?
ముఖ్యమంత్రి జగన్ కు సంక్రాంతి పండగ తర్వాత ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయి. ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు సంక్రాంతి పండగ తర్వాత ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయి. ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. పీఆర్సీ పై స్పష్టత రాకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఆందోళన చేయాలని నిర్ణయించాయి. గత నెల రోజుల నుంచి ప్రభుత్వం పీఆర్సీపై నానుస్తూ వస్తోంది. చర్చల పేరిట కాలయాపన చేస్తుందని ఉద్యోగ సంఘాలు గట్టిగా నమ్ముతున్నాయి. పీఆర్సీపై ప్రభుత్వం ఇప్పట్లో స్పష్టత ఇచ్చే అవకాశం లేదని వారు భావిస్తున్నారు.
ఆందోళనను విరమించి...
దీంతోపాటు తాము దశల వారీగా ఇచ్చిన ఆందోళనను సయితం విరమింప చేశారు. చీఫ్ సెక్రటరీతో చర్చల సందర్భంగా ఉద్యోగ సంఘాల చేత ఆందోళనను విరమింప చేశారు. ఇందుకు కారణం కూడా బలంగా ఉండటంతో ఉద్యోగ సంఘాలు కూడా ఆందోళనను విరమించడానికి సిద్ధపడ్డాయి. ముఖ్యమంత్రి జగన్ తో చర్చలు ఉంటాయని, అక్కడకు నల్ల బ్యాడ్జీలు ధరించి వెళితే మంచిది కాదని సీఎస్ చెప్పడంతోనే వారు విరమణకు ఓకే చెప్పారు.
పట్టించుకోక పోవడంతో.....
కానీ ఇప్పుడు ప్రభుత్వం తీరు చూస్తుంటే పీఆర్సీతో పాటు తాము ఉంచిన 70 డిమాండ్లను కూడా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడాన్ని ఉద్యోగ సంఘాలు సీరియస్ గా తీసుకున్నాయి. ఈ నెల 9వ తేదీ తర్వాత తిరిగి ఉద్యమించాలని నిర్ణయించాయి. ఉద్యోగ సంఘాల ఐక్య జేఏసీ సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యమాన్ని జిల్లా స్థాయిలో నిర్వహించి, తర్వత చలో విజయవాడకు కూడా ప్లాన్ చేశాయి. ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయాలని డెసిషన్ తీసుకున్నాయి. ఆఖరి అస్త్రంగా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించాయి. సంక్రాంతి తర్వాత జగన్ కు ఉద్యోగుల నుంచి ఝలక్ తప్పదంటున్నారు.
Next Story