Sun Nov 24 2024 04:07:31 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ మస్ట్ గో...వందశాతం ఢిల్లీలో పంచాయతీ పెడతా
తెలంగాణలో విద్యుత్తు సంస్కరణలను అమలుపర్చమని రావాల్సిన నిధులను కూడా కేంద్రం ఆపేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
తెలంగాణలో విద్యుత్తు సంస్కరణలను అమలుపర్చడం లేదని రావాల్సిన నిధులను కూడా కేంద్రం ఆపేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. గ్రామీణ ఉపాధి పథకం వంటి పథకాల్లో రావాల్సిన నిధుల్లో కోత విధిస్తున్నారు. మోదీకి ఎనిమిదేళ్లు టైం ఇచ్చామని చెప్పారు. ఎనిమిదేళ్లు వేచి చూసినా ఆయనలో మార్పు రాలేదని, సంస్కరణల పేరిట ప్రజలను ఇబ్బంది పెట్టే ఆలోచనలో ఉన్నారని కేసీఆర్ మండి పడ్డారు. విద్యుత్తు శాఖను పూర్తిగా ప్రయివేటీకరించి ఆయన తాబేదార్లకు అప్పజెప్పాలని మోదీ చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి విరాళాలిచ్చే వారికే విద్యుత్తును అప్పగించాలన్న కుట్ర జరుగుతుందన్నారు. 77 శాతం సంపద కేవలం పది మంది చేతుల్లోనే ఉందని ఆరోపించారు.
సంస్కరణలతో ఛార్జీలు పెరుగుతాయి....
అదే జరిగితే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. విద్యుత్తు ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయని కేసీఆర్ చెప్పారు. తమకు విషయం అర్థమయ్యే మోదీ రంగు బయటపెట్టానని అన్నారు. డిస్కమ్ లను ప్రయివేటుపరం చేయాలనుకోవడం దారుణమని కేసీఆర్ చెప్పారు. సంస్కరణల్లో భాగంగా సబ్సిడీలను ఎత్తివేయాలని కండిషన్లు పెట్టారన్నారు. పేదప్రజలు ఏమై పోతారని కేసీఆర్ ప్రశ్నించారు. జలవిద్యుత్తు ను ఆపేసి సౌర విద్యుత్తునే కొనుగోలు చేయాలని షరతు పెడుతుందన్నారు. 40 వేల కోట్ల మంది దళితులకు బడ్జెట్ లో 12 వేల కోట్లు కేటాయించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కిషనర్ రెడ్డి తనకు బడ్జెట్ పై అవగాహన లేదన్నారని, ఈసారి అలా మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు.
ఎనిమిదేళ్లలో ఏ రంగం?
ఏరంగంలో అభివృద్ధి సాధించారో చెప్పాలని కేసీఆర్ మోదీని నిలదీశారు. ఎన్ఎస్ఈ చెప్పిన లెక్కల ప్రకారం ఉపాధి, పారిశ్రామిక రంగంలో ఏం సాధించావో తెలిసిపోతుందని చెప్పారు. ఆయన అభివద్ధి అంతా వాట్సాప్ యూనివర్సిటీలోనే కన్పిస్తుందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. నిజంగా 12 శాతం వృద్ధి ఉందా అని ప్రశ్నించారు. అదే జరిగితే దేశం ఎప్పుడో అభివృద్ధి చెందేదన్నారు. బీజేపీ పాలనలో దేశం సర్వనాశనమయిందన్నారు. అన్ని రంగాలను అమ్మేసేటందుకే మోదీ వచ్చారన్నారు. క్షుద్ర సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారన్నారు. ఈ దేశం నుంచి బీజేపీ వెళ్లిపోవాలని కేసీఆర్ మరోసారి డిమాండ్ చేశారు.
జైల్లో వేస్తానంటూ...
తనను జైల్లో వేస్తానని మోదీ పార్టీ బెదిరిస్తుందని, తనకు ఏం భయం లేదని కేసీఆర్ చెప్పారు. ఈడీ, సీబీఐ కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు. మోదీ చిట్టా అంతా తనవద్ద ఉందని, రఫేల్ డీల్ లో వేల కోట్లు మింగేశారని, తాము వాళ్లను లోపలేస్తామని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. మోదీ హయాంలో 22 మంది బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయారన్నారు. జైలంటే దొంగలకు భయమని, తమకు కాదని కేసీఆర్ అన్నారు. వందశాతం ఢిల్లీలో పంచాయతీ పెడతామని కేసీఆర్ చెప్పారు. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని చెప్పారు.
సుప్రీంకోర్టులో కేసులు వేస్తాం..
రఫేల్ డీల్ పై సుప్రీంకోర్టులో కేసు వేస్తామని చెప్పారు. వాజపేయి నాయకత్వంలో కొంత నీతి నిజాయితీ ఉండేదని, ఇప్పుడు ఈ పార్టీకి సిద్ధాంతాలు, సిగ్గూ లేదన్నారు. ఎన్నికల్లో గెలవకున్నా అధికారంలో ఉంటామని చెప్పే ఏకైక పార్టీ అని అన్నారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, గోవాల్లో గెలవకున్నా అధికారం చేపట్టారని కసీఆర్ ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని ప్రయత్నించడం బీజేపీకి మాత్రమే సాధ్యమని ఆయన చెప్పారు. అమెరికాకు వెళ్లి ట్రంప్ ను గెలిపించాలని ప్రచారం చేయడం మోదీ వ్యూహం కాదా? అని ప్రశ్నించారు.
Next Story