Mon Dec 23 2024 11:27:36 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త సెక్రటేరియట్.. కార్యక్రమం ఇలా
తెలంగాణ కొత్త సచివాలయాన్ని నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇరవై నెలల్లో ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించారు.
తెలంగాణ కొత్త సచివాలయాన్ని నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇరవై నెలల్లో ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించారు. కొత్త సచివాలయం ప్రారంభానికి ముందు యాగాన్ని నిర్వహించనున్నారు. వాస్తుపూజ యాగం ఈరోజు ఉదయం నిర్వహిచనున్నారు. ఈ యాగాన్ని మంత్రి ప్రశాంత్‌రెడ్డి దంపతులు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయానికి చేరుకుంటారు.
నాలుగు వందల కోట్ల....
మొత్తం నాలుగు వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ అద్భుతమైన కట్టడం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటుంది. అత్యాధునిక సౌకర్యాలతో దీనిని నిర్మించారు. ఆరు అంతస్తులలో నిర్మించిన ఈ నూతన సచివాలయంలో అన్ని వసతులను ఏర్పాటు చేసింది. సోలార్ విద్యుత్తును వినియోగించనున్నారు. కేసీఆర్ ఆశించిన విధంగానే నూతన సచివాలయాన్ని తీర్చి దిద్దారు. రేపటి నుంచి కొత్త సచివాలయం నుంచే పాలన ప్రారంభం కానుంది.
తొలి సంతకం...
మధ్యాహ్నం ఒంటి గంటకు కొత్త సచివాలయానికి చేరుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ 1.20 నుంచి 1.32 గంటల మధ్య శిలాఫలాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం వాస్తుపూజ యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం ఆరో అంతస్థులోని తన ఛాంబర్లో కూర్చుని తొలి సంతకం చేస్తారు. మధ్యాహ్నం 1.58 గంటల నుంచి 2.04 గంటల మధ్య మంత్రులందరూ తొలి సంతకం చేస్తారు. 2.15 గంటలకు అధికారులు, సిబ్బంది సభ ప్రాంగణానికి చేరుకుంటారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తారు. అక్కడే భోజన ఏర్పాట్లు కూడా చేశారు.
Next Story