Mon Nov 25 2024 18:52:08 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : సెప్టంబరులో విశాఖ నుంచి పాలన
విశాఖలో ఈ సెప్టంబరు నుంచి పాలన సాగించబోతున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.
అందరికీ ఆమోదయోగ్యమైన విశాఖలో ఈ సెప్టంబరు నుంచి పాలన సాగించబోతున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. విశాఖలోనే తాను కాపురం ఉంటానని తెలిపారు. మూలపాడు పోర్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ పాలనా వికేంద్రీకరణలో భాగంగా సెప్టంబరు నుంచి విశాఖ నుంచే తాను పాలన కొనసాగిస్తానని, విశాఖలోనే తాను ఇక ఉంటానని ఆయన చెప్పారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి మూలపేట పోర్టు తోడ్పడుతుందని జగన్ అన్నారు.
మంచి జరగాలనే...
మత్స్యకారులకు మంచి జరగాలనే హార్బర్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. చెన్నై, ముంబై మాదిరిగా శ్రీకాకుళం జిల్లా మారుతుందని జగన్ తెలిపారు. పోర్టు ఆధారిత పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఉద్దానంలో కిడ్నీ సమస్య పరిష్కారానికి ఏ ప్రభుత్వమూ చొరవ చూపలేదని అన్నారు. ఉద్దానంలో త్వరలోనే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించనున్నట్లు జగన్ ప్రకటించారు. జూన్ లో ఈ కిడ్నీరీసెర్చ్ సెంటర్ ను ప్రారంభిస్తానని జగన్ హర్షధ్వనాలు తెలిపారు. గత ప్రభుత్వాలు ఈ ప్రాంతానికి ఏం చేశాయని ఆయన ప్రశ్నించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి...
తమ ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చాలని మే 3వతేదీన భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. అదే రోజు అదానీ డేటా సెంటర్ కు కూడా శంకుస్థాపన చేస్తామని తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు వీలుగా ఆరు లేన్ల రహదారిని నిర్మించబోతున్నామని తెలిపారు. గతంలో ఏ పాలకులైనా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇంత ధ్యాస పెట్టారా? అని జగన్ ప్రశ్నించారు.
Next Story