Sun Nov 24 2024 01:58:41 GMT+0000 (Coordinated Universal Time)
13 లక్షల కోట్ల పెట్టుబడులు.. గర్వపడుతున్నా
విశాఖలో గ్లోబల్ సమ్మిట్ జరపడం గర్వంగా ఉందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు
విశాఖలో గ్లోబల్ సమ్మిట్ జరపడం గర్వంగా ఉందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు ఈ సమ్మిట్ ద్వారా 92 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని జగన్ తెలిపారు. పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని తెలిసి ఆనంద పడుతున్నానని తెలిపారు. ఆరు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇరవై రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారన్నారు. మిగిలిన ఎంవోయూలు రేపు జరుగుతాయని తెలిపారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో తొలిరోజు సభలో ఆయన మాట్లాడారు.
ఆరు లక్షల మందికి ఉపాధి...
మొత్తం 340 పెట్టుబడుల ప్రతిపాదనలు ఈ సమ్మిట్ ద్వారా వచ్చాయన్నారు. పెట్టుబడులకే కాదు ప్రకృతి అందాలకు కూడా విశాఖపట్నం నెలవు అని జగన్ అన్నారు. 8.54 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఈరోజు అవగాహన ఒప్పందాలు జరుగుతాయని జగన్ తెలిపారు. రేపు మిగిలిన ఎంవోయూలు కుదుర్చుకుంటామని తెలిపారు. ప్రభుత్వం పెట్టుబడిదారులకు అన్ని రకాలుగా ప్రోత్సహాకాలను అందిస్తుందన్నారు. 975 కిలోమీటర్ల తీరప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు మంచి అవకాశమని చెప్పారు. పోర్టుల సంఖ్య కూడా పెంచుతున్నామని తెలిపారు.
కీలకమైన రాష్ట్రంగా...
ఇండియాలో అతి కీలకమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని జగన్ అన్నారు. విశాఖపట్నం చిన్న ఎకనామిక్ హబ్ అని ఆయన తెలిపారు. సహజవనరులతో ఉన్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎన్నో రంగాల్లో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని జగన్ తెలిపారు. ఆరు రేవులు రాష్ట్రమంతటా విస్తరించి ఉన్నాయని తెలిపారు. ఎగుమతులు సులువుగా తక్కువ ధరకు చేసుకోవచ్చని తెలిపారు. ఏపీలో భూమి విస్తారంగా అందుబాటులో ఉందని తెలిపారు. వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ సెప్టంబరులో జరుగుతుందన్నారు. క్రియాశీలక ప్రభుత్వం ఏపీలో ఉందని తెలిపారు. పెట్టుబడులకు ముప్పులేని వాతావరణం ఏపీలో ఉందని, అందరూ పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు.
Next Story