ఆ ధైర్యం ఉందా? : జగన్ సవాల్
ఈరోజు రాష్ట్రంలో యుద్ధం జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తెనాలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట
ఈరోజు రాష్ట్రంలో యుద్ధం జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి కడుపు మంట పుడుతుందన్నారు. కడుపు మంటకు, అసూయకు మందు లేదన్నారు. ఈ యుద్ధంలో గెలుపు ఎవరిదన్నది ప్రజలు నిర్ణయిస్తారన్నారు. తెనాలిలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. కరువుకు కేరాఫ్ అయిన చంద్రబాబుకు రైతు ప్రభుత్వమైన జగన్ కు మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో యుద్ధం ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? బీసీలకు వ్యతిరేకమన్న పెత్తందారీ పార్టీలకు మనకు మధ్య జరుగుతుందని తెలిపారు. ఇచ్చిన మ్యానిఫేస్టోలో 98 శాతం హామీలను నెరవేర్చి ఓట్లు అడగటానికి ముందుకు వస్తున్నానని, అది నా ధైర్యమని జగన్ అన్నారు. మంచి చేశాడని అనిపిస్తే తనకు తోడుగా ఉండమని జగన్ కోరారు. తనకు భయం లేదని, తాను సవాల్ విసురుతున్నానని, చంద్రబాబు, దత్తపుత్రుడు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే ధైర్యముందా అని జగన్ సవాల్ విసిరారు.