Sat Dec 21 2024 02:27:04 GMT+0000 (Coordinated Universal Time)
పాక్ కపట బుద్ధి మారదా?. బిపిన్ మరణంపై కూడానా?
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ మరణించారు. దీనిపై పాక్ తన కపట బుద్ధిని మార్చుకోలేదు
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ మరణించారు. ఇది దేశం తట్టుకోలేని సమయం. ఒక వీరుడిని కోల్పోయి యావత్ దేశం శోక సంద్రంలో మునిగింది. దాదాపు నాలుగు దశాబ్దాలు భారత రక్షణ వ్యవస్థలో పనిచేస్తూ దేశ సేవలో తరించిన బిపిన్ రావత్ మరణం ఎవరూ ఊహించలేదు. సరిహద్దుల్లో సింగంగా మారాడు. పాక్, చైనాలకు వణుకుపుట్టించాడు. ఆయన మరణంతో వీరుడా వందనం అంటూ భారత్ మొత్తం నినదిస్తుంది. అదే సమయంలో పాక్ తన పోకడలను మార్చుకోలేదు.
పాక్ లో....
మాజీ సైన్యాధికారి బల్జిత్ బక్షి బిపిన్ రావత్ మృతి ఖర్మగా అభివర్ణించారు. తిరిగి ఆయన తన మాటలను వెనక్కు తీసుకున్నారు. క్షమాపణలు కోరారు. కానీ పొరుగుదేశమైన పాక్ ఆర్మీ మాత్రం ఈ ఘటన పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ లు చేయడం చర్చనీయాంశమైంది. పాక్ తన కపట బుద్ధిని మార్చుకోలేదు. ఇప్పుడు ఖర్మ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండింగ్ లో ఉంది. ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి దర్యాప్తు కు ఆదేశించింది.
24 గంటల క్రితం....
ప్రమాదానికి గల కారణాలు తెలియరానప్పటికీ పాక్ లో మాత్రం కొందరు నీచులు ఈ ఘటనను ఖర్మగా చెబుతూ కామెంట్స్ పెట్టడంపై భారత్ లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్ లో సియాచిన్ లో నిన్న పాక్ ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. దానికి భారత్ సైనికులు పండగ చేసుకున్నారని, దాని ఖర్మ ఫలితమే నేడు జరిగిన ఘటన అని పాక్ సైనికులు కామెంట్స్ చేస్తున్నారు. జరగరాని ఘటన జరిగి ఒక వీరుడిని కోల్పోయి భారత్ పాలుపోని స్థితిలో ఉన్న సమయంలో పాక్ చేస్తున్న కామెంట్స్ మరింత మంట పుట్టించేవిగా ఉన్నాయి రెండు యుద్ధాల్లో ఓటమి చెందినా పాక్ కు బుద్ధి రాలేదు. కార్గిల్ వంటి పరిమిత యుద్ధంలో ఓటమి కూడా పాక్ కు గుర్తు లేదు. ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తే మంచిదని పాక్ కు మంచిదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story