మలుపులు తిరుగుతున్న జయరాం కేసు
వేలకోట్ల రూపాయల సామ్రాజ్య అధినేత చిగురుపాటి జయరాం హత్య కేసు ఇంకా పలు మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో మేనకోడలే హత్యకు కారణం అయ్యిందనే కోణం తొలుత [more]
వేలకోట్ల రూపాయల సామ్రాజ్య అధినేత చిగురుపాటి జయరాం హత్య కేసు ఇంకా పలు మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో మేనకోడలే హత్యకు కారణం అయ్యిందనే కోణం తొలుత [more]
వేలకోట్ల రూపాయల సామ్రాజ్య అధినేత చిగురుపాటి జయరాం హత్య కేసు ఇంకా పలు మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో మేనకోడలే హత్యకు కారణం అయ్యిందనే కోణం తొలుత బయటకు రాగా ఇప్పుడు కొత్త ట్విస్ట్ లు మొదలయ్యాయి. హత్య జరిగి మూడు రోజులు పూర్తి అయినా పోలీసులు ఈ కేసు మిస్టరీని ఇంకా వెల్లడించక పోవడం పలు విమర్శలకు దారితీస్తుంది. కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠి నేరుగా ఈకేసును పర్యవేక్షిస్తున్నా హంతకులను పట్టుకోలేక పోవడంతో సర్వాత ఉత్కంఠ బయల్దేరింది. అక్రమ సంబంధాలు, ఆర్ధిక లావాదేవీలు ఈ హత్యకు కారణం గా ప్రాధమికంగా తేలగా ఈ చిక్కు ముడులను విప్పుతూ రావడం ఖాకీలకు భారంగా మారినట్లు తెలుస్తుంది.
కుక్క లను చంపే ఇంజెక్షన్ తో …
కుక్కలను నిర్ములించడానికి వాడే ఇంజెక్షన్ చేతి నరానికి ఇవ్వడం ద్వారా జయరాం ను మర్డర్ చేసినట్లు భావిస్తున్నారు. అయితే ఈ అంశాలను పోలీసులు, వైద్యులు ధృవీకరించలేదు. హత్య జరిగిన వార్త తెలిసాక జయరాం మేనకోడలు మావయ్య ఇంటికి వెళ్ళి తనపేరిట వున్న పొలం డాక్యుమెంట్ల కోసం ప్రయత్నం చేయడం, తన స్నేహితుడితో లాంగ్ డ్రైవ్ కి ముందు రోజు వెళ్లానని చెప్పడం అనుమానాలు కలిగిస్తుంది. ఈ హత్యాతో తనకు సంబంధం లేదని శిఖా వాదించడం విశేషం. తనకు తన సోదరికి మేనమామతో లైంగిక సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిపినట్లు జరుగుతున్న ప్రచారం చర్చనీయాంశం గా మారింది. ఇదిలా ఉంటే ప్రముఖ పారిశ్రామిక వేత్త కావడంతో జయరాం కేసులో కొందరు అధికారులు, నేతలు ఖాకీలపై వత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు ఇంకెలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.