పిల్లల్లో గుండెపోటు.. కారణాలివేనా..?
ఇటీవల ముంబయిలో.. ఓ 18 ఏళ్ల కుర్రోడుకి చెమటలు పడుతున్నాయని, గుండెలో నొప్పిగా ఉందని ఆసుపత్రికి ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు. వైద్య పరీక్షలు చేయగా అతని గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయని తెలిసింది. వెంటనే స్టంట్ వేసి ఆ కుర్రాడిని కాపాడారు. సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకొని వచ్చారు కాబట్టి సరిపోయింది.
ఇటీవల ముంబయిలో.. ఓ 18 ఏళ్ల కుర్రోడుకి చెమటలు పడుతున్నాయని, గుండెలో నొప్పిగా ఉందని ఆసుపత్రికి ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు. వైద్య పరీక్షలు చేయగా అతని గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయని తెలిసింది. వెంటనే స్టంట్ వేసి ఆ కుర్రాడిని కాపాడారు. సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకొని వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఓ నిండు ప్రాణం గుండెపోటుకు బలయ్యేది అని సీనియర్ కార్డియాలజిస్ట్ అభిషేక్ చెప్పారు. ఆ కుర్రాడు మంచి అథ్లెట్, క్రికెటర్ కూడా. రోజూ సాయంత్రం జంక్ ఫుడ్ తినేవాడు. అతని శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోయాయి.
ఈమధ్య 18 ఏళ్ల లోపు వారికి కూడా గుండెపోటు రావడం వైద్య రంగాన్ని కలవరపెడుతోంది. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి గుండె సమస్యలు రావడం. సహజం. గత పదేళ్లలో 40 నుంచి 50 వయసు వాళ్ల మధ్యలో కూడా హృద్రోగ సమస్యలు ఐదు రెట్లు పెరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత రెండు, మూడేళ్ళుగా 18 ఏళ్ల లోపు పిల్లలు కూడా గుండె జబ్బుతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరుతున్నారు. గుండెలో రక్త నాళాలు బ్లాక్ అవ్వడం, తద్వారా స్టంట్ వేయాల్సి రావడం లాంటి కేసులు ఇటీవల కాలంలో కనిపిస్తున్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయని హృద్రోగ నిపుణులు చెబుతున్నారు.
జంక్ ఫుడ్ పిల్లల ఆరోగ్యాల మీద విపరీతమైన ప్రభావం చూపిస్తోంది. సాయంత్రం వీధుల్లో ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి. నిర్వాహకులు వాడే పదార్ధాలు, ముఖ్యంగా కలుషిత నూనె కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి గుండెకి చేటు తెస్తోంది. తల్లిదండ్రులు ఈ విషయం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
నగర జీవితం, చదువులు, కెరీర్ అంటూ విద్యార్థుల మీద పెరుగుతున్న విపరీతమైన వత్తిడి యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పిల్లల్లో శారీరక వ్యాయామం లేకపోడం మరో కారణం. నగర జీవితంలో ఉదయాన్నే బయల్దేరి ఏ రాత్రికో ఇంటికి చేరుతున్నారు. ఇక ఆటలకి టైం ఎక్కడ ఉంటుంది? పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ కూడా ఉందని మరో సీనియర్ కార్డియాలజిస్టు బ్రియాన్ పింటా చెప్పారు కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత చాలామందిలో గుండె పోటుకు గురి అవుతున్నారని ఆయన వెల్లడించారు. జంక్ ఫుడ్ నివారించడం, శరీరానికి కొద్దిసేపైనా ఎక్సర్సైజ్ చేయడం, వత్తిడిని తగ్గించుకోవడం లాంటి జీవన శైలి మార్పులతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.