జగన్ కు ఆ బాధ తెలియదా?
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. జైలు నుంచి విడుదలయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ [more]
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. జైలు నుంచి విడుదలయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ [more]
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. జైలు నుంచి విడుదలయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ 16 నెలలు జైలులో ఉన్నారని, ఆయనకు ఆ బాధ తనకు తెలియదా? అని ప్రశ్నించారు.తనపై 18 తప్పుడు కేసులు పెట్టి రెండు నెలలు జైల్లో ఉంచారన్నారు. జైల్లో తన ముందే హత్యలుచేసిన వాళ్లు, అత్యాచారం చేసిన వాళ్లు బెయిల్ పై విడుదలవుతుంటే, తనకు మాత్రం బయటకు రానివ్వకుండా అనేక కేసులు పెట్టారన్నారు. తాను ఏ దళితుడిని దూషించానని రుజువు చేసినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చింతమనేని ప్రభాకర్ సవాల్ విసిరారు. తాను చేసిన తప్పేంటో రాష్ట్ర ప్రజల ముందు పెట్టాలని కోరారు. ఆరునెలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానని చెప్పిన జగన్ తనను బాధ ఎందుకు పెట్టారన్నారు. తాను దళిత వ్యతిరేకినని దెందులూరు నియోజకవర్గంలో ఏ దళితుడు చెప్పినా తాను రాజకీయాల నుంచి త్పుకుంటానన్నారు. వనజాక్షి వ్యవహారంలో జగన్ పూర్తి స్థాయి విచారణ జరపాలని చింతమనేని డిమాండ్ చేశారు.