Thu Jan 16 2025 13:07:35 GMT+0000 (Coordinated Universal Time)
చింతమనేనికి సీరియస్ వార్నింగ్
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు చంద్రబాబు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఎన్నిసార్లు చెప్పినా చింతమనేని ప్రభాకర్ వినడం లేదని సీనియర్ నేతల ముందు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.తరచూ వివాదాల్లో చిక్కుకుంటుండటంతో పార్టీని ఇబ్బందులు పాల్జేస్తున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేవలం పనిచేస్తేనే సరిపోదని, వ్యక్తిగత ఇమేజ్ కూడా అవసరమని బాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. పద్ధతి మార్చుకోకుంటే తాను కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని బాబు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల చింతమనేని తన వర్గీయులతో కలసి వైసీపీ నేతపై దాడిచేసిన నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
- Tags
- andhra pradesh
- ap politics
- chinthamaneni prabhakar
- janasena party
- nara chandrababu naidu
- pavan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- చింతమనేని ప్రభాకర్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story