రాజశేఖర్ మైకు లాక్కోవడంతో..చిరంజీవి
హీరో చిరంజీవి, రాజశేఖర్ ల మధ్య “మా” వేదికగా వివాదాలు బయటపడ్డాయి. మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం పార్క్ హయత్ హోటల్ లో జరిగింది. ఈ సందర్భంగా [more]
హీరో చిరంజీవి, రాజశేఖర్ ల మధ్య “మా” వేదికగా వివాదాలు బయటపడ్డాయి. మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం పార్క్ హయత్ హోటల్ లో జరిగింది. ఈ సందర్భంగా [more]
హీరో చిరంజీవి, రాజశేఖర్ ల మధ్య “మా” వేదికగా వివాదాలు బయటపడ్డాయి. మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం పార్క్ హయత్ హోటల్ లో జరిగింది. ఈ సందర్భంగా మంచి ఉంటే బయటకు చెబుదాం, చెడు ఉంటే చెవిలో చెబుదామని చిరంజీవి అన్నారు. అయితే దీనికి రాజశేఖర్ అభ్యంతరం తెలిపారు. పర్చూరు గోపాలకృష్ణ వద్ద ఉన్న మైకు ను లాక్కున్న రాజశేఖర్ నిప్పులాంటి నిజాన్ని దాచిపెట్టడం మంచిది కాదని, అది ఎప్పటికైనా మండుతుందని అన్నారు. రాజశేఖర్ వ్యాఖ్యలపై చిరంజీవి సీరియస్ అయ్యారు. తాను మంచిగా చెబితే దాన్ని రాజశేఖర్ వివాదం చేయడం తగదని, ఆవేశాలకు వెళ్లడం సరికాదని అన్నారు. మా అసోసియేషన్ వల్లనే తన ఇంట్లో గొడవలు జరిగాయని, యాక్సిడెంట్ అయిందని చెప్పి రాజశేఖర్ కార్యక్రమం మధ్యలోనే రాజశేఖర్ వెళ్లిపోయారు. అయితే దీనిపై రాజశేఖర్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చర్యలు తీసుకునే అవకాశముంది. దీంతో మా అసోసియేషన్ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.