Mon Dec 23 2024 02:02:35 GMT+0000 (Coordinated Universal Time)
నైట్ షిఫ్ట్ చేస్తున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి
నైట్ షిఫ్టులతో ఆరోగ్యానికి చాలా రిస్కులున్నాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. నైట్ షిఫ్టుల వల్లే ప్రాణాంతక వ్యాధుల ముప్పు
నైట్ షిఫ్ట్స్.. ఇప్పుడు అక్కడ.. ఇక్కడ అని కాదు.. అన్ని దేశాల్లోనూ నైట్ షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులున్నారు. భారత్ లోనూ నైట్ షిఫ్టులు చేసే ఉద్యోగులకు కొదువ లేదు. ఐటీ, ఫార్మా రంగాల్లో ఈ షిఫ్టులు ఎక్కువగా ఉంటాయి. కానీ.. నైట్ షిఫ్టులతో ఆరోగ్యానికి చాలా రిస్కులున్నాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. నైట్ షిఫ్టుల వల్లే ప్రాణాంతక వ్యాధుల ముప్పు పెరుగుతోందని, మరణాల రేటు ఎక్కువగా ఉంటోందని సమాచారం.
తరచూ షిఫ్టులు మారుతూ ఉండటం వల్ల ఆల్జీమర్స్, డిమెన్షియా సమస్యల బారిన పడతారని.. మరణాల రేటు పెరగడానికి వీటికి మధ్య సంబంధం ఉన్నట్లు పరిశోధకులు చేసిన అధ్యయనంలో గుర్తించారు. అలాగే.. " నైట్ షిప్ట్ కారణంగా ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటే అది అధిక సీరమ్ టోటల్ కొలెస్టరాల్, ఎల్ డీఎల్ పెరిగేందుకు దారితీస్తుంది. నైట్ షిప్ట్ పనుల వల్ల సర్కాడియన్ క్లాక్ లో మార్పులతో సీ రియాక్టివ్ ప్రొటీన్ (రక్తనాళాల్లో వాపు), బ్లడ్ ప్రెజర్ పెరిగిపోతాయి. దీంతో గుండె జబ్బులు, మధుమేహం రిస్క్ ఏర్పడతాయి " అని డాక్టర్ గ్రెగర్ తెలిపారు.
Also Read : టాలీవుడ్ లో మరో విషాదం.. యువనటి దుర్మరణం
నైట్ షిఫ్టుల్లో పనిచేసేవారు వీలైనంత తక్కువ ఆహారం తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాత్రి డ్యూటీ చేసి.. ఉదయాన్నే ఇంటికి వచ్చాక ఫ్యాటీ ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోకుండా.. ఆరోగ్యకరమైన వాటిని తీసుకుంటే మంచిది. రాత్రి పూట ఆహారం తీసుకోకపోయినా ఫర్వాలేదు కానీ.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ మాత్రం మానరాదని వైద్యులు సూచిస్తున్నారు. నిజానికి ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకునేవారిలో గుండె జబ్బులు చాలా తక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు.
Next Story