Tamilnadu : పది జిల్లాలకు రెడ్ అలర్ట్…. నీటిలోనే చెన్నై
చెన్నై నగరం ఇంకా నీటిలోనే నానుతుంది. భారీ వర్షాల కారణంగా చెన్నై నీట మునిగింది. దీంతో ప్రభుత్వం సూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. పది జల్లాలకు ప్రభుత్వం [more]
చెన్నై నగరం ఇంకా నీటిలోనే నానుతుంది. భారీ వర్షాల కారణంగా చెన్నై నీట మునిగింది. దీంతో ప్రభుత్వం సూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. పది జల్లాలకు ప్రభుత్వం [more]
చెన్నై నగరం ఇంకా నీటిలోనే నానుతుంది. భారీ వర్షాల కారణంగా చెన్నై నీట మునిగింది. దీంతో ప్రభుత్వం సూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. పది జల్లాలకు ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించింది. వాతావరణ శాఖ నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది. దాదాపు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపింది.
సహాయక చర్యలను…
గత కొద్ది రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అనేక పట్టణాలు నీట మునిగాయి. సహాయక చర్యలను ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో చెన్నైలో జన జీవనం స్థంభించిపోయింది. తిరవళ్లూరు జిల్లాలో వేలాది ఎకరాలు నీట మునిగాయి. ప్రభుత్వం వరద బాధితుల కోసం ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేసింది.