Mon Dec 23 2024 18:30:34 GMT+0000 (Coordinated Universal Time)
75 శాతం ఉద్యోగాలు స్థానికులకే : సీఎం వైఎస్ జగన్
75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించేలా ఇప్పటికే రాష్ట్రంలో చట్టం చేశామని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం సమస్యలు పరిష్కారం..
బలభద్రపురం : తూ.గో. జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిం ఇండస్ట్రీ కోర్ ఆల్కలీ యూనిట్‌ను బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గ్రాసిమ్ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి రూ.2,700 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ప్రత్యక్షంగా 1300మంది, పరోక్షంగా 1150 మందికి అవకాశం లభిస్తుందని అన్నారు. ఇలాంటి కంపెనీలు రావడంతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.
75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించేలా ఇప్పటికే రాష్ట్రంలో చట్టం చేశామని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం సమస్యలు పరిష్కారం కాకుండా సంతకాలు చేస్తే.. మన ప్రభుత్వం వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరించి కంపెనీ పనులు ముందుకు సాగేలా చేశామన్నారు. అవరోధాలను ఒక్కొక్కటిగా తొలగించి ప్రాజెక్టును నెలకొల్పామని సీఎం జగన్ అన్నారు. ఈ పరిశ్రమ వల్ల 1,300 మందికి ప్రత్యక్షంగా 1,150 మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుందని చెప్పారు. ఈ పరిశ్రమ ఏర్పాటుపై గతంలో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారని... ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
Next Story