Mon Dec 23 2024 07:08:53 GMT+0000 (Coordinated Universal Time)
13 కొత్తజిల్లాలు, రెవెన్యూ డివిజన్లను ప్రారంభించిన సీఎం జగన్
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లను ప్రారంభించారు. నేటి నుంచే 26 జిల్లాల్లో..
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ లో నవశకం ఆవిష్కృతమైంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లను ప్రారంభించారు. నేటి నుంచే 26 జిల్లాల్లో పాలన ఆరంభం కానుంది. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా 13 కొత్త జిల్లాలు, 23 కొత్త రెవెన్యూ డివిజన్లను ప్రారంభించడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు. కొత్తగా ఆవిష్కరించిన జిల్లాల్లో అతిచిన్న జిల్లాగా పార్వతీపురం ఉంది. కొత్తజిల్లాలతో ఆంధ్రప్రదేశ్ నూతన చిత్రాన్ని ఆవిష్కరించారు.
ఏపీలో కొత్తగా.. పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, కోనసీమ జిల్లా, ఏలూరు జిల్లా, నరసాపురం జిల్లా, బాపట్ల జిల్లా, నరసరావుపేట జిల్లా, తిరుపతి, అన్నమయ్య జిల్లా, నంద్యాల జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలు ఏర్పాటయ్యాయి. ప్రతి జిల్లాలోనూ 3 నుంచి 8 నియోజకవర్గాలున్నట్లు అధికారులు వివరించారు. విస్తీర్ణ పరంగా ప్రకాశం (14,322 చదరపు కిలోమీటర్లు), జనాభా పరంగా నెల్లూరు జిల్లా (24.697లక్షలు) పెద్దవి. రెండు జిల్లాల్లోనూ 8 నియోజకవర్గాలు, 38 మండలాలున్నాయి. జనాభా, విస్తీర్ణంతో పార్వతీపురం మన్యం జిల్లా అతి చిన్న జిల్లాగా ఉంది.
Next Story