Mon Dec 23 2024 14:29:28 GMT+0000 (Coordinated Universal Time)
అమర సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చెక్కులు అందించిన సీఎం కేసీఆర్
భేటీ అనంతరం అమర సైనికుల కుటుంబాలకు సీఎం నితీష్ తో కలసి తెలంగాణ ప్రభుత్వం తరపున చెక్కులు..
తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్ లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా గల్వాన్ ఘర్షణల్లో అమరులైన 10 మంది బీహార్ సైనికుల కుటుంబాలకు సీఎంకేసీఆర్ రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో కలిసి ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను సైనికుల కుటుంబాలకు అందజేశారు. బుధవారం మధ్యాహ్నం బీహార్ కు చేరుకున్న సీఎం కేసీఆర్.. నారాయణ్ ఎయిర్ పోర్టు నుంచి నేరు సీఎం నితీశ్ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం నితీశ్, తేజస్వీ యాదవ్ తో కేసీఆర్ కొద్దిసేపు భేటీ అయ్యారు.
భేటీ అనంతరం అమర సైనికుల కుటుంబాలకు సీఎం నితీష్ తో కలసి తెలంగాణ ప్రభుత్వం తరపున చెక్కులు అందించారు. అలాగే కొన్నినెలల క్రితం సికింద్రాబాద్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి వేల మంది బీహారీలు కృషి చేస్తున్నారని అన్నారు. గాల్వాన్ లో వీర సైనికుల త్యాగం ఎంతో గొప్పదని, అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని కేసీఆర్ అన్నారు.
Next Story