Mon Dec 23 2024 08:03:27 GMT+0000 (Coordinated Universal Time)
మల్లన్నసాగర్ ను జాతికి అంకితమిచ్చిన సీఎం కేసీఆర్
ఎన్ని కేసులు పెట్టినా.. ఇంజినీర్లు భయపడకుండా పనిచేయడాన్ని కేసీఆర్ అభినందించారు. హైదరాబాద్ కు మంచినీటి..
మల్లన్నసాగర్ : కాళేశ్వర గంగమ్మ ప్రస్థానంలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. 50 టీఎంసీల అతిపెద్ద జలాశయమైన మల్లన్నసాగర్ ను సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో నిర్మించిన మల్లన్నసాగర్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది చారిత్రకమైన ఘట్టమని సీఎం పేర్కొన్నారు. ఈ కల సాకారమయ్యేందుకు మహాయజ్ఞంలో పనిచేసిన వారందరికీ పేరుపేరునా అభినందనలు తెలిపారు. మల్లన్నసాగర్ పూర్తవ్వకుండా అడుగడుగునా కేసులు వేస్తూ అడ్డం పడ్డారని, దాదాపు 600 కేసులు వేశారని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
Also Read : బాబాయ్ ట్రైలర్ పై అబ్బాయ్ రివ్యూ !
ఎన్ని కేసులు పెట్టినా.. ఇంజినీర్లు భయపడకుండా పనిచేయడాన్ని కేసీఆర్ అభినందించారు. హైదరాబాద్ కు మంచినీటి సమస్యను తీర్చిన సింగూరు ప్రాజెక్టును తలదన్నేలా మల్లన్న ప్రాజెక్టును రూపొందించడం జరిగిందని కేసీఆర్ వివరించారు. 20 లక్షల ఎకరాలను తన కడుపులో పెట్టుకుని కాపాడుకొనే ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్టు అని తెలిపారు. మల్లన్న సాగర్ వద్ద రూ. 100 కోట్లతో ఇరిగేషన్ కాంప్లెక్స్ వెంటనే ప్రారంభించాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే కలర్ ఫౌంటేన్ ను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మున్ముందు మల్లన్నసాగర్ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
Next Story