కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్
నూతన రెవెన్యూ బిల్లును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఉద్యోగులకు ఎటువంటి ముప్పు లేదన్నారు. రెవెన్యూ అధికారులతో చర్చించామని చెప్పారు. [more]
నూతన రెవెన్యూ బిల్లును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఉద్యోగులకు ఎటువంటి ముప్పు లేదన్నారు. రెవెన్యూ అధికారులతో చర్చించామని చెప్పారు. [more]
నూతన రెవెన్యూ బిల్లును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఉద్యోగులకు ఎటువంటి ముప్పు లేదన్నారు. రెవెన్యూ అధికారులతో చర్చించామని చెప్పారు. తెలంగాణలో భూముల రేట్లు పెరిగాయన్నారు. సబ్ రిజిస్ట్రార్ల అధికారులు తహసిల్దార్లకు అప్పగించనున్నారు. పాస్ పుస్తకాలు లేని భూములకు వాటిని జారీ చేసే అధికారం తహసిల్దార్లకే ఉంటుందని కేసీఆర్ చెప్పారు. అక్రమాలకు పాల్పడితే ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగించేలా చట్టంలో నిబంధనలను రూపొందించారు. జాగీరు భూములను ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. ఏరకమైన రిజిస్ట్రేషన్ కైనా స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నారు. ఇందుకోసం ధరణి పోర్టల్ ను త్వరలో అందుబాటులోకి తెస్తామని కేసీఆర్ చెప్పారు. అవినీతి అంశమే కొత్త రెవెన్యూ చట్టానికి మూలమని చెప్పారు.