కేసీఆర్ ఫోన్… ఆయన ఫిదా…!!!
తన భూసమస్యను సోషల్ మీడియాలో పెట్టి ఆవేదన వ్యక్తం చేసిన రైతు మొరను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలకించారు. నేరుగా రైతులకే ఫోన్ చేసి మాట్లాడి సమస్యను పరిష్కరించారు. [more]
తన భూసమస్యను సోషల్ మీడియాలో పెట్టి ఆవేదన వ్యక్తం చేసిన రైతు మొరను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలకించారు. నేరుగా రైతులకే ఫోన్ చేసి మాట్లాడి సమస్యను పరిష్కరించారు. [more]
తన భూసమస్యను సోషల్ మీడియాలో పెట్టి ఆవేదన వ్యక్తం చేసిన రైతు మొరను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలకించారు. నేరుగా రైతులకే ఫోన్ చేసి మాట్లాడి సమస్యను పరిష్కరించారు. మంచిర్యాల జిల్లా నెన్నేల మండలం నందులపల్లికి చెందిన రైతు శరత్.. తన ఏడు ఎకరాల భూమిని వీఆర్వో వేరే వారి పేరు మీదకు మార్చి రైతుబంధు డబ్బులు తీసుకున్నారని ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీని గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా శరత్ కు ఫోన్ చేశారు. సమస్యను పూర్తిగా తెలుసుకొని, భూమికి సంబంధించిన వివరాలు, డాక్యుమెంట్లు తనకు ఫ్యాక్స్ చేయాలని సూచించారు. అనంతరం ఈ సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరిని ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రెవెన్యూ వ్యవస్థలో ఇటువంటి సమస్య లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. వీఆర్వోను వెంటనే సస్పెండ్ చేస్తామన్నారు.