Mon Jan 13 2025 00:00:38 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ ఆత్మగౌరవానికి మరో పరీక్ష
ఈ ఎన్నికలు తెలంగాణ ఆత్మగౌరవానికి మరో పరీక్ష అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. వరంగల్ నగరంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు మన ఇంటికే వచ్చిన మనల్ని కొట్టి పోతా అంటున్నారని, వరంగల్ వంటి చైతన్యవంతమైన ప్రాంత ప్రజలు ఆయనకు బుద్ధిచెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి చంద్రబాబు ద్వారా వలస ఆధిపత్యాన్ని తీసుకువస్తోందని, మా దగ్గర వలస ఆధిపత్యం చెల్లదని ఓటుతో జవాబు చెప్పాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని, తాను ఎప్పుడు పిలుపునిచ్చినా ఉద్యమ జెండా కింద పడకుండా కాపాడింది వరంగల్ జిల్లానేని గుర్తు చేశారు.
Next Story