Tue Apr 15 2025 14:50:41 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి మేకపాటికి సీఎం జగన్ అశ్రు నివాళి
సీఎం జగన్ రాకతో.. మేకపాటి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. జగన్తో గౌతమ్ రెడ్డి అత్యంత సన్నిహితంగా మెలగిన క్షణాలను..

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మరణంతో ఏపీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన స్వస్థలమైన నెల్లూరు జిల్లాలో అభిమానులు గౌతమ్ రెడ్డి మరణవార్త విని కన్నీరు పెట్టుకున్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు తరలి వస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతి మేకపాటి నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు.
సీఎం జగన్ రాకతో.. మేకపాటి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. జగన్తో గౌతమ్ రెడ్డి అత్యంత సన్నిహితంగా మెలగిన క్షణాలను గుర్తు చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులు జగన్ కనిపించగానే.. ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యుల రోదనలను చూసి.. జగన్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. తన పక్కనే ఉన్న రాజమోహన్ రెడ్డిని జగన్ ఓదార్చగా.. జగన్ సతీమణి వైఎస్ భారతి గౌతమ్ రెడ్డి తల్లి, సతీమణిని ఓదార్చారు. అమెరికాలో చదువుకుంటున్న గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ వచ్చాక.. ఎల్లుండి అధికార లాంఛనాలతో నెల్లూరు జిల్లాలోని బ్రాహ్మణపల్లిలో గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
News Summary - CM YS Jagan and YS Bharathi Paid Tribute to Mekapati Gautam Reddy's Dead Body
Next Story