Fri Nov 22 2024 09:37:26 GMT+0000 (Coordinated Universal Time)
సంక్రాంతి సంబరాల్లో.. సీఎం జగన్ దంపతులు
సీఎం జగన్, ఆయన సతీమణి భారతితో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో..
తెలుగు రాష్ట్రాల్లో భోగి పర్వదినంతో.. సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ప్రతిగ్రామంలో.. వీధుల్లో వేకువజామునే భోగిమంటలు వేసి.. పిల్ల, పెద్ద అంతా కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో పల్లె, పట్టణ ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్, ఆయన సతీమణి భారతితో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో.. సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ సామాగ్రి, ఎండ్ల బండ్లు, గడ్డి వాములు, పశుసంపద, కుల వృత్తుల చిత్రాలతో పల్లె వాతావరణాన్ని ప్రతిభించేలా ఏర్పాటు చేశారు.
తొలుత సీఎం జగన్ దంపతులు జ్యోతిని వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. అనంతరం గోశాలలో గోపూజ చేసి, భోగి మంటలు వెలిగించారు. హరిదాసు కీర్తనలు ఆలకించి.. ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుడు ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన శ్రీనివాస కల్యాణం ప్రదర్శనను సీఎం జగన్ దంపతులు ఆసక్తిగా తిలకించారు. కాగా.. సంక్రాంతి సంబరాల్లో భాగంగా.. నవరత్నాలతో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించిన నేపథ్యంలో గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. సీఎం జగన్ దంపతులు పల్లెవాతావరణం ఉట్టేపడేలా ఏర్పాటు చేసిన పరిసరాలను ఆసక్తిగా తిలకించారు.
Next Story