Tue Nov 05 2024 03:26:55 GMT+0000 (Coordinated Universal Time)
Cold Winds : చలిగాలులతో వణికిపోతున్న జనం... బయటకు రావడానికి భయం
రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. ఉదయం నుంచి చలిగాలులు ప్రారంభమవుతున్నాయి. ప్రజలు బయటకు వచ్చేందుకే భయపడిపోతున్నారు
రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. ఉదయం నుంచి చలిగాలులు ప్రారంభమవుతున్నాయి. ప్రజలు బయటకు వచ్చేందుకే భయపడిపోతున్నారు. హైదరాబాద్ లో ఉదయం తొమ్మిది గంటలయినా చలి గాలులు తగ్గడం లేదు. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. శ్వాస కోశ ఇబ్బందులను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. అనేక మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. చలిగాలులకు బయటకు రావద్దని, ఆరోగ్యం పాడు చేసుకోవద్దని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. మరణాలు కూడా సంభవించే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో...
హైదరాబాద్ మాత్రమే కాదు ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలికి గజ గజ వణికిపోతున్నారు. ఉదయం పది గంటలయినా చలి తీవ్రత తగ్గడం లేదు. చలి మంటలు వేసుకుని ప్రజలు చలిగాలుల నుంచి తమకు తాము రక్షించుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. నిజమాబాద్, మెదక్, కరీంనగర్ ప్రాంతాల్లోనూ చలిగాలుల జోరు ఎక్కువగా ఉండటంతో ఉదయం పది గంటలకు కూడా ప్రజలు బయటకు వచ్చేందుకు జడుస్తున్నారు.
అల్పపీడనం.. తుఫానుగా మారి...
ఇక ఆంధ్రప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ, ఏజెన్సీ ఏరియాలో చలిగాలులు ఎక్కువగా ఉన్నాయి. అరకు ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే ఈనెల 16న ఉపరిత ఆవర్తనం ఏర్పడి, 18వ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అది శ్రీలంక - తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ వైపు సాగుతుండటంతో మో భారీ తుఫాన్ వచ్చే అవకాశముందని చెబుతున్నారు. తుఫానుగా ఏర్పడితే ఈ నెల 21, 22, 23, 24, 25 తేదీల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రైతులు తమ పంటలను ఈలోపు రక్షించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Next Story