Mon Dec 23 2024 07:54:04 GMT+0000 (Coordinated Universal Time)
తోకలుగానే మిగిలిపోతారా?
కమ్యునిస్టులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కనుమరుగవుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత వాటి పరిస్థితి మరింత క్షీణించింది.
కమ్యునిస్టులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కనుమరుగవుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ రెండు పార్టీల పరిస్థిితి మరింత క్షీణించింది. అందుకే ఎన్నికల వరకూ ఆ పార్టీల మద్దతు పొందినా ఎన్నికల సమయంలో మాత్రం కమ్యినిస్టులను పెద్దగా పట్టించుకోవడం లేదు. వారికిచ్చిన సీట్లు వృధాయేనన్న నమ్మకం అన్ని పార్టీలలో ఉంది. మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వారు మార్పు కోరుకోకపోవడం కూడా పార్టీ పరిస్థిితి దిగజారడానికి కారణమని చెబుతున్నారు.
విభజన తర్వాత....
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వామపక్ష పార్టీలు ఒక్క స్థానాన్ని కూడా సాధించుకోలేకపోయాయి. పార్టీలతో పొత్తు పెట్టుకున్నా ఫలితం లేదు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తుతో బరిలోకి పోట ీ చేసినా వారికి పట్టున్న గిరిజన ప్రాంతాల్లోనే ప్రజలు కమ్యునిస్టు అభ్యర్థులను తిరస్కరించారు. దీంతో గత పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సీపీఐ, సీపీఎంలకు ప్రాతినిధ్యం లేకుండానే పోయింది.
టీడీపీతో కలసి....
మళ్లీ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి తొలి నుంచి సీపీఐ సిద్ధమయింది. సీపీఎం కొంత అటు ఇటుగా ఉన్నా సీపీఐ మాత్రం చంద్రబాబు జేబు సంస్థగా మారిందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. గత మూడేళ్ల నుంచి సీపీఐ చంద్రబాబును నమ్ముకునే రాజకీయం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళితే కనీసం కొన్ని స్థానాలైనా దక్కుతాయన్నది సీపీఐ అగ్రనేతల అంచనాగా ఉంది.
కానీ కష్టమేనా?
కానీ చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకునే ఆలోచన తీవ్రంగా చేస్తున్నారు. కమ్యునిస్టుల మాదిరి ఏపీలో బీజేపీకి బలం లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉండటంతో దాని వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. అదే జరిగితే మరోసారి సీపీఐకి అవమానం జరిగినట్లే. సీపీఐ మూడేళ్లుగా చంద్రబాబును అంటిపెట్టుకుని ఉండి ప్రయోజనం లేదని క్యాడర్ భావించే అవకాశముంది. గతంలోనే కొన్ని జిల్లాల క్యాడర్ బాబుతో అనుబంధంపై అసంతృప్తిని వ్యక్తం చేశాయి. దీనికి నారాయణ, రామకృష్ణలు బాధ్యత వహించాలని తీర్మానం కూడా చేశాయి. మరి ఈసారి ఎన్నికలు కూడా నారాయణ పార్టీకి చిడతలు తప్ప మరేవీ మిగలవు అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story