ఐటీ సోదాల్లో బయటపడిన నల్లధనం
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఫార్మా కంపెనీ లో ఐటీ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పెద్దఎత్తున అవకతవకలు బయటికి వచ్చాయి. తప్పుడు పత్రాలతో బోగస్ కంపెనీలు ఏర్పాటు [more]
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఫార్మా కంపెనీ లో ఐటీ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పెద్దఎత్తున అవకతవకలు బయటికి వచ్చాయి. తప్పుడు పత్రాలతో బోగస్ కంపెనీలు ఏర్పాటు [more]
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఫార్మా కంపెనీ లో ఐటీ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పెద్దఎత్తున అవకతవకలు బయటికి వచ్చాయి. తప్పుడు పత్రాలతో బోగస్ కంపెనీలు ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్లుగా ఐటీ అధికారుల సోదాలో బయటపడింది. దాదాపు 400 కోట్ల రూపాయల విలువ చేసే నిధులతో కంపెనీ యాజమాన్యం సొంతంగా ఆస్తులను కూడబెట్టిరని అధికారులు విచారణలో తేలింది. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు పలు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో ఆస్తులను కొనుగోలు చేసినట్టుగా వెలుగుచూసింది. పలు రాష్ట్రాల్లో జరిగిన ఈ ఐటీ సోదాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఐటి అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. గత నెల 24వ తేదీన ఐటీ సోదాలు కు సంబంధించిన సమాచారాన్ని అధికారులు విడుదల చేశారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఈ ఫార్మా కంపెనీ పైన ఐదు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన ఉత్పత్తులను అమెరికాతో పాటు యూరోప్ లకు ఎగుమతి అవుతుంటాయి. అయితే 350 కోట్ల రూపాయలు సంబంధించిన నిధుల పైన ఐటీ అధికారులు ముందస్తుగా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంలో బోగస్ పత్రాలను పెట్టి పెద్ద మొత్తంలో నకిలీ కంపెనీలను ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు. ఈ కంపెనీల ద్వారా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల లావాదేవీలు బయటపడింది. ఈ నాలుగు వందల కోట్ల రూపాయల మొత్తాన్ని కూడా అధికారులు నల్లధనం గా భావిస్తున్నారు. ఐటి సోదాల్లో పెద్దఎత్తున భూములకు సంబంధించిన ప్రజలతోపాటు పెన్ డ్రైవ్ లు హార్డ్ డిస్కులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.