Sat Nov 23 2024 05:29:25 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ పని అయిపోయింది..బీజేపీకి సవాల్ విసరగల వ్యక్తి ఒక్కరే !
"చనిపోయిన గుర్రాన్ని కొరడాలతో కొట్టడంలో అర్థం లేదు. కాంగ్రెస్ చనిపోయిన గుర్రం" అని ఆప్కి కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు,
కాంగ్రెస్ పార్టీ ఒక "చనిపోయిన గుర్రం" అని, దానిని కొరడాలతో కొట్టడంలో అర్థం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ అంటోంది. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ సమావేశానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాజరై, అందులో చేరేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేయడంపై ఆప్ సెటైర్లు విసిరింది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అద్భుతమైన విజయం సాధించగా.. జాతీయ రాజకీయాల్లో బీజేపీని ఎదిరించగల సత్తా ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు మాత్రమే ఉందని అంటున్నారు ఆప్ నాయకులు.
"చనిపోయిన గుర్రాన్ని కొరడాలతో కొట్టడంలో అర్థం లేదు. కాంగ్రెస్ చనిపోయిన గుర్రం" అని ఆప్కి కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు, పార్టీ అధికార ప్రతినిధి రాఘవ్ చద్దా చెప్పారు. కాంగ్రెస్కు భవిష్యత్తు లేదని, భారతీయులకు భవిష్యత్తు ఇవ్వలేదని అన్నారు. "ఏదైనా సున్నాకి గుణిస్తే అది సున్నా" అవుతుందని చద్దా అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడం ద్వారా కేజ్రీవాల్ పాలనా విధానం దేశం మొత్తానికి తెలుస్తోందని అన్నారు. "బీజేపీని ఎన్నికలలో ఎదుర్కోగల వ్యక్తి ఒక్కరే ఉన్నారని, ఆ వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే" అని చద్దా అన్నారు.
కాంగ్రెస్ వరుస ఓటములతో కొట్టుమిట్టాడుతుండగా, 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీలోకి చేరేందుకు ఎన్నికల వ్యూహకర్త కిషోర్ సిద్ధంగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ తీసుకోవాల్సిన నిర్ణయాలపై కాంగ్రెస్ నాయకులకు వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు.
Next Story