బ్రేకింగ్: ఎన్నికలను బహిష్కరించిన కాంగ్రెస్
పార్టీ ఫిరాయింపులకు నిరసనగా రేపు జరగాల్సిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు బహిష్కరిస్తున్నట్లు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన [more]
పార్టీ ఫిరాయింపులకు నిరసనగా రేపు జరగాల్సిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు బహిష్కరిస్తున్నట్లు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన [more]
పార్టీ ఫిరాయింపులకు నిరసనగా రేపు జరగాల్సిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు బహిష్కరిస్తున్నట్లు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలు సిగ్గుపడేలా వికృత చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును, రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తూ పార్టీ ఫిరాయింపులు చేయిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ అప్రజాస్వామిక చర్యలపై పోరాటం చేస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిల్లో గూగూరు నారాయణరెడ్డిని కాంగ్రెస్ బరిలో నిలిపింది. అయితే, ఇప్పటికే ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది. దీంతో ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది.