అటు అహంకారం.. ఇటు ఆరు హామీలు!
ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతున్నాయి. కేటీయార్ గురి తప్పింది. దాదాపు అరవై స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. తెలంగాణను సాధించిన పార్టీ, సంక్షేమ పథకాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిన పార్టీ అయిన భారాసకు ఎందుకీ దురవస్థ? కేసీయార్ దూకుడు ముందు చిగురుటాకులా వణికిపోయిన కాంగ్రెస్ మళ్లీ ఎలా ప్రాణం పోసుకుంది? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పడం పెద్ద కష్టం కాదు.

సంక్షేమ పథకాల అమలు, శాంతి భద్రతల పరిరక్షణలో భారాసను ఎవరూ వేలెత్తి చూపించలేరు. అయితే పథకాలు ఇస్తున్నాం కదా, ప్రజల్లోకి వెళ్లడమెందుకు అనే భావనలో భారాస అగ్ర నాయకత్వం ఉండటం తెలంగాణ వాసులను చాలా చిరాకు పెట్టింది. పథకాల్లో ఆశ్రిత పక్షపాతం కూడా జనాలకు ఉద్యమ పార్టీ మీద వెగటు పుట్టించింది. ఎన్నికల సమయంలోనే ప్రజల ముందుకు వచ్చే కేసీయార్, ట్టిటర్లో మాత్రమే కనిపించే కేటీయార్ల వైఖరి నేటి భారాస దురవస్థకు ప్రధాన కారణం.
పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మితిమీరిన అవినీతి నిరుద్యోగుల అసంతృప్తికి కారణమైంది. ఉద్యోగులను కూడా భారాస ఇబ్బంది పెట్టింది. ఆర్టీసీ సమ్మెను నిర్దాక్షిణ్యంగా అణచివేసిన విషయాన్ని వాళ్లెవరూ మరిచిపోలేదు.
ఇక ఆరు హామీలతో కాంగ్రెస్ ప్రజలకు బాగా చేరువైంది. కర్ణాటకలో తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న తీరును హస్తం నేతలు జనాలకు వివరించగలిగారు. రేవంత్రెడ్డి దూకుడు కూడా ఆ పార్టీకి కలిసి వచ్చింది. భాజపా ‘వ్యూహాత్మక’ వెనకడుగు కూడా హస్తానికి హస్తమందించింది. కాంగ్రెస్ను విజయతీరాలకు చేరుస్తోంది.